Vikarabad: వికారాబాద్ ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు - కలెక్టర్
Vikarabad: వికారాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియపై కలెక్టర్ దీపక్ తివారీ సమీక్ష. జూలై 20 లోపు లక్ష్యం పూర్తి చేయాలని, సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆదేశం.
Vikarabad: వికారాబాద్ ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు - కలెక్టర్
వికారాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ హెచ్చరించారు. శుక్రవారం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తహసిల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....
జిల్లాలో జూలై 20 లోపు డిజిటలైజేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికీ 15 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి రోజు తప్పని సరిగా 15 శాతం డిజిటలైజేషన్ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు 100 మంది ఓటర్లను డిజిటలైజేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ముందస్తుగా టామ్ టామ్ ద్వారా , చెత్త సేకరించే వాహనాల ద్వారా సమాచారాన్ని అందించి ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
డిజిటలైజేషన్ తక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లను జిల్లా అధికారులు సందర్శించి సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఐకెపి ఎపిఎం, ఫీల్డ్ అసిస్టెంట్లు, విఓఏ, రిసోర్స్ పర్సన్ ల సహకారం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఏ ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు.
13వ తేదీ ఉదయం లోపు 45 శాతం డిజిటలైజేషన్ పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు అధికారులు సెలవుల్లో వెళ్ళడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైని) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, డిఆర్ఓ స్వర్ణలత, జెడ్పి సీఈఓ సుధీర్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, మెప్మా పీడీ రవికుమార్, డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్, డిడబ్ల్యూఓ కాంతారావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.




