Vikarabad: వికారాబాద్ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం

Vikarabad: వికారాబాద్‌లో ఎల్ నినో ప్రభావంపై కలెక్టర్ సమీక్ష. వరి బదులు కందులు, చిరుధాన్యాలు సాగు చేయాలని రైతులకు సూచన. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.

MOGULAIAH, VIKARABAD
Updated on: 9 July 2026 8:53 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం

వికారాబాద్: నీటి ఎద్దడిని తట్టుకునే, వర్షాధార పంటలను సాగు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు.

గురువారం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు లు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ....

నీటి ఆధారిత పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల అతి తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నీటి ఆధారిత పంటలు వేసినట్లయితే రైతులు నష్టపోతారు అనే విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఆయకట్టు కింద ఉన్న పొలాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అంటే కందులు, మొక్కలు, చిరుధాన్యాల పంటలను వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుండి జిల్లా వ్యవసాయ అధికారి కవిత, ఇరిగేషన్ డిఈ మంజుల సిబ్బంది పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story