Thalakondapally: లింగరావుపల్లి వాసికి రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
Thalakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లిలో బొచ్చుపల్లి పెద్ద జంగయ్యకు రూ. 60 వేల CMRF చెక్కు అందజేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి.
Thalakondapally: లింగరావుపల్లి వాసికి రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన బొచ్చుపల్లి పెద్ద జంగయ్య గారికి 60,000 రూపాయల చెక్కు కల్వకుర్తి ఎమ్మెల్యే పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నేత కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా అందించడం జరిగింది.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అనారోగ్యంతో బాధపడే వారు ఎవరైనా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే సీఎంఆర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డీ పోతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బసప్ప శేఖర్ గౌడ్ యాదయ్య జంగయ్య శ్రీధర రబ్బానీ శివారెడ్డి నాగమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.




