Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్‌లో కాంగ్రెస్ వర్గపోరు!
Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీల ఏర్పాటుపై కాంగ్రెస్‌లోని ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత. శేరి సతీష్‌రెడ్డి ఫ్లెక్సీలను చింపేసిన కార్యకర్తలు.
Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్‌లో కాంగ్రెస్ వర్గపోరు!
Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీల ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించిన సతీష్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. ఫ్లెక్సీల్లో స్థానిక నాయకుల ఫొటోలు పెట్టకుండా సతీష్‌రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, తోపులాటకు దారితీసింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను చింపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లెక్సీలను చింపివేసిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో వై జంక్షన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




