LB Nagar: ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కియా కారు!

LB Nagar: ఎల్‌బీనగర్ చింతలకుంట వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కియా కారు వెనుక నుంచి ఢీకొట్టగా, ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 10 Sept 2026 12:35 PM IST
LB Nagar
X

LB Nagar: ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కియా కారు!

LB Nagar: చింతలకుంట వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న విజయవాడ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కియా కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

కారు ఢీకొన్న సమయంలో ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. అయితే ప్రమాదం అనంతరం కారు డోర్లు లాక్ కావడంతో అందులో ఉన్న వ్యక్తులు కొంతసేపు ఆందోళనకు గురైనట్లు తెలిసింది.

కారులో స్థానిక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు ఉన్నట్లు సమాచారం. ఓ రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటన్న దానిపై ఎల్‌బీనగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story