Chevella: చేవెళ్ల ఎస్‌ఐఆర్ ఓటరు సవరణపై గాంధీభవన్‌లో సమీక్ష
Chevella: చేవెళ్ల నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గాంధీభవన్‌లో భీమ్ భరత్, జగదీష్ సమీక్ష. 100% ఓటరు జాబితా అప్‌డేట్ పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు.
Chevella: చేవెళ్ల ఎస్‌ఐఆర్ ఓటరు సవరణపై గాంధీభవన్‌లో సమీక్ష
చేవెళ్ల: చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం SIR ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ పురోగతిపై గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ జగదీశ్ మరియు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, చేవెళ్ళ నియోజక వర్గం కో ఆర్డినేటర్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ,చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల పురోగతిని సమీక్షించారు. అందిన ప్రతి ఫారం తప్పనిసరిగా డిజిటలైజేషన్ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందని అర్హత కలిగిన ఓటర్లను గుర్తించి వారికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆగస్టు 3న SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి బూత్‌ను క్షుణ్ణంగా పరిశీలించి 100 శాతం ఓటర్ల జాబితా అప్‌డేట్ అయ్యేలా BLOలు, BLAలు, బూత్ స్థాయి నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని భీమ్ భరత్ గారు పిలుపునిచ్చారు.
ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా జాబితాను పరిశీలించాలని, పట్టణం లేదా స్వగ్రామంలో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉండాలో అక్కడ మాత్రమే నమోదు ఉండేలా చూడాలని సూచించారు. అలాగే మరణించిన వారి వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఓటరు జాబితాను సక్రమంగా సవరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్యానికి, ప్రజా సంక్షేమానికి ఓటే వజ్రాయుధం అని పేర్కొన్న భీమ్ భరత్ గారు, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటుహక్కును కాపాడుకోవాలని, SIR ప్రక్రియలో BLOలు, BLAలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తూ, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని నాయకులు, BLAలు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు.




