Chevella: పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్!

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ దశదినకర్మకు కేటీఆర్ హాజరై, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 2 Aug 2026 2:37 PM IST
Chevella
X

Chevella: పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల

కేటీఆర్ పరామర్శ: ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ పట్నం నరేందర్ రెడ్డి తల్లిగారైన రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇటీవల రుక్కమ్మగారు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన దశదినకర్మ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీమతి రుక్కమ్మ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం, పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,

ఇలాటి సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శ్రీమతి రుక్కమ్మ గారికి నివాళులు అర్పించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story