Chevella: పట్నం సోదరులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పట్నం రుక్కమ్మ గారి దశదినకర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
Chevella: పట్నం సోదరులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల
పట్నం రుక్కమ్మ దశదినకర్మ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ (95) దశదినకర్మ కార్యక్రమం అత్యంత భావోద్వేగ వాతావరణంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై, స్వర్గీయ రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రుక్కమ్మ, ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రోజు దశదినకర్మ సందర్భంగా వారికి నివాళులర్పించారు.
అనంతరం పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పరామర్శించారు.
తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..తల్లి స్థానం ఎప్పటికీ పూడ్చలేనిదని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.




