Chevella: షాబాద్ మండలం నరేడ్లగూడెంలో కంది పంటలను పరిశీలించిన ఏడీఏ

Chevella: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నరేడ్లగూడెంలో చేవెళ్ల ఏడీఏ సురేష్ బాబు కంది పంటలను పరిశీలించి, ఎల్-నినో నేపథ్యంలో ఆరుతడి పంటలు వేయాలని సూచించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 29 July 2026 6:25 PM IST
Chevella
X

Chevella: షాబాద్ మండలం నరేడ్లగూడెంలో కంది పంటలను పరిశీలించిన ఏడీఏ

చేవెళ్ల: షాబాద్ మండలం... ఈరోజు చేవెళ్ళ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు(ఏ.డి.ఎ) బి. జే సురేష్ బాబు మరియు మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, షాబాద్ మండలం నరేడ్లగూడెం గ్రామంలో కంది పంటలను పరిశీలించి, ఎల్-నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితులను

దృష్టిలో ఉంచుకొని సమగ్ర పంటల యాజమాన్య అధికారిక సూచనలు అందించారు. తేమ లేని నేలలో ఎరువులు వేయకూడదని, వర్షం కురిసిన తరువాత 24–48 గంటల తర్వాతే టాప్ డ్రెస్సింగ్ ఎరువులు వేయాలని సూచించారు.

కంది పంటలో అధిక దిగుబడి మరియు నాణ్యమైన ఉత్పత్తి కోసం సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను పాటించడం అవసరం. పంట ప్రారంభ దశ నుండి కోత వరకు పొలాన్ని క్రమం తప్పకుండా పరిశీలించి, అవసరమైన యాజమాన్య చర్యలను చేపట్టాలి.

ప్రధాన తెగుళ్లు, విల్ట్ , స్టెరిలిటీ మొజాయిక్, ఫైటోఫ్తోరా బ్లైట్.ప్రధాన పురుగులు, కాయతొలిచే పురుగు, ప్లూమ్ మాత్, రసం పీల్చే పురుగులు..సమగ్ర పంట యాజమాన్య, సమగ్ర కలుపు యాజమాన్య, సమగ్ర పోషక యాజమాన్య మరియు సమగ్ర పురుగు–తెగుళ్ల యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా కంది పంటలో అధిక దిగుబడి, మెరుగైన నాణ్యత మరియు అధిక లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు.

ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. 31 జూలై నుండి 15 ఆగస్టు వరకు ఇంకావిత్తని భూముల్లో తగినంత వర్షపాతం, అంటే 50 నుండి 75 మిల్లీమీటర్లు నమోదైన తరువాత మాత్రమే విత్తనాలు వేయండి. వర్షాభావ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము, అలసంద, జొన్న, సజ్జ, కొర్రలు, రాగులు, నువ్వులు తక్కువ నీటి అవసరమున్న పంటలకు ప్రాధాన్యత ఇవ్వండి.

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు లేదా చిరుధాన్యాలను సాగు చేయండి. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, మండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలతోనే పంటల నిర్వహణ చేపట్టండని రైతులకు వివరించారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇంకా మిగిలిపోయిన రైతులు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు, వీరి వెంట వ్యవసాయ విస్తరణ అధికారి శివతేజ, బాబ్య, శివ కుమార్, షాబాద్ ఎఫ్.పి.ఓ (సి.ఇ.ఓ) చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ యాదగిరి, క్రిషిసఖి శ్రీలత రైతులు, బర్క వెంకయ్య, అంజయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story