Ranga Reddy: చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తి దాయకం.. శేఖర్ యాదవ్!

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి ఘనంగా జరిగింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Sept 2026 2:03 PM IST
Ranga Reddy
X

Ranga Reddy: చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తి దాయకం.. శేఖర్ యాదవ్!

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ అని జిల్లా మండల సర్పంచుల సంఘం తలకొండపల్లి అధ్యక్షులు కటికెల శేఖర్ యాదవ్ ముదిరాజ్ అన్నారు.

గురువారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలో సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివక్షకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ సాధన ఉద్యమానికి నాంది పలికిందన్నారు. తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.

ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వర్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ లలిత జోతయ్య మాజీ ఉప సర్పంచ్ అనిల్ ముదిరాజ్ వార్డు సభ్యుడు వెంకటయ్య దశరథం రాములు గ్రామ పెద్దలు గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story