Kadthal: చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం సర్పంచ్ బొప్పిడి గోపాల్!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ బొప్పిడి గోపాల్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Sept 2026 5:22 PM IST
Kadthal
X

Kadthal: చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం సర్పంచ్ బొప్పిడి గోపాల్!

Kadthal: తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ అని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. గురువారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో వార్డు సభ్యుడు, రజక సంఘం అధ్యక్షుడు సోమరాజు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలో సర్పంచ్ బొప్పిడి గోపాల్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివక్షకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ సాధన ఉద్యమానికి నాంది పలికిందన్నారు. తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.

ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో రావిచేడ్ గ్రామంలో విగ్రహాన్ని ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, వార్డు సభ్యులు రమేష్, రామస్వామి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు బాలకృష్ణ, శ్రీనివాస్, లింగం, బిక్షపతి, జితేందర్ రెడ్డి, జమీర్, పవన్ కుమార్, పాండు, రాజు, రాములు, రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, దేవేందర్, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రమేష్, యాదగిరి, సత్యనారాయణ, భాస్కర్, గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేష్, సాయికుమార్, నరేష్, ప్రవీణ్, తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story