LB Nagar: చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన సీపీఎం!

LB Nagar: ఎల్బీనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 10 Sept 2026 4:40 PM IST
LB Nagar
X

LB Nagar: చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన సీపీఎం!

LB Nagar: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ ) ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ సభకు సిపిఎం ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య అధ్యక్షత వహించగా. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చంద్రమోహన్ జిల్లా కమిటీ సభ్యులు, కీసరి నర్సిరెడ్డిలు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన జమీందారు.

జాగిర్దారి విధానానికి వ్యతిరేకంగా భానుచందర్ ధర నీ కాల్మొక్త అన్న పేదోళ్లు బందుకు పట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించి 3000 గ్రామాలను విముక్తి చేసి, పది లక్షల ఎకరాలను భూమి పంచిన సాయుధ పోరాటం భాగస్వాములు అయిన వారిలో కామ్రేడ్ చాకలి ఐలమ్మ ఒకరని వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకొని వారి ఆశయ సాధన కొరకు మనమంతా కృషి చేయాలని అన్నారు.

నాడు జాగీర్దార్లు, భూస్వామశక్తులు నాటి కాలంలో పేద ప్రజలు, వృత్తిదారులు ఇతర ప్రజానికంతో వెట్టిచాకిరి చేయించుకునేవారని దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో తెలంగాణలో ఒక ఉవ్వెత్తున ఉద్యమం ఏగిసిపడిందని అన్నారు, నాడు నిజాం రాజు భారత్ లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉంటానని చెప్పారు.

నిజాం సైన్యము మరియు జమీందారు జాగిర్దారులు ప్రజలు పండించిన పంటను సగానికి పైగా పన్నుల రూపంగా కొల్లగొడుతుంటే, దానికి వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల తుదముట్టించి భారత యూనియన్ లో విలీనం కావడానికి కారణమయ్యిందన్నారు. నేటి బిజెపి పాలకులు చరిత్రను వక్రీకరించి అది హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ తప్పుడు సంకేతలను ప్రజల్లోకి చెప్పించి ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారని అని అన్నారు, దానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజల ఐక్యతను కాపాడాలని కోరారు. తద్వారని ఐలమ్మ ఆశయం సాధించిన వారలమవుతామని ఈ 41 వ సంస్మరణ సభకు మనకు సందేశంగా భావించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చంద్రమోహన్ జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య హయత్ నగర్ సర్కిల్ నాయకులు చింతపల్లి కృష్ణయ్య, ముషం నరహరి,

, నాయుని, శ్రీనివాస్, బూరెల్ల భాస్కర్, చెన్నారం మల్లేశం, రాధ, DYFI రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రమావత్ అజినాయక్. మన్యం రాధమ్మ లింగస్వామి, కిరణ్, దండు అంజమ్మ. కలమ్మ. లాట్ల లక్ష్మణ్, యాదయ్య, కొండపల్లి చంద్రమౌళి, పి జయమ్మ, ప్రేమలత, కే అంజమ్మ, లక్ష్మి, కవిత. నరసమ్మ,రేణుక, తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story