Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: చైతన్యపురి పోలీసులు
Hyderabad: చైతన్యపురి పీఎస్‌లో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో ఇన్‌స్పెక్టర్ సైదులు సమన్వయ సమావేశం.
Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: చైతన్యపురి పోలీసులు
చైతన్య పురి: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ కే. సైదులు ఉత్సవ నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆగమనం, ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలకు ముందస్తు పోలీస్ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి అని హెచ్చరించారు. పాడ్ బ్యాండ్ పేరుతో నిషేధిత డీజేలు ఏర్పాటు చేసి, పరిమితికి మించి శబ్దం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీల్లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులను కోరారు. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఇన్‌స్పెక్టర్ కే. సైదులు తెలిపారు. సమన్వయ సమావేశంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు, సహచరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




