Boduppal: బోడుప్పల్‌లో చైన్ స్నాచర్ బీభత్సం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధురాలిపై దాడి!

Boduppal: బోడుప్పల్‌లో చైన్ స్నాచర్ బీభత్సం. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధురాలి మెడలోని 4.5 తులాల మంగళసూత్రం చోరీ.

KARUNAKAR, UPPAL
Published on: 16 Jun 2026 8:21 AM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో చైన్ స్నాచర్ బీభత్సం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధురాలిపై దాడి!

బోడుప్పల్: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ వృద్ధురాలిని టార్గెట్ చేసిన గుర్తుతెలియని చైన్ స్నాచర్ బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారైన ఘటన బోడుప్పల్‌ లోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో జరిగింది. కాలనీకి చెందిన నర్ర అరుణ (72) ప్రతిరోజు మాదిరిగానే సోమవారం ఉదయం నడకకు వెళ్లారు.

రాజశేఖర్ కాలనీ వైపు వెళ్తుండగా నార్త్ బాలాజీ హిల్స్ కాలనీలోని సాకుబు నిలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. ఒక్కసారిగా దగ్గరకు వచ్చి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కొని బైక్‌ పై వేగంగా పరారయ్యాడు.

ఈ ఘటనలో వృద్ధురాలి మెడకు స్వల్ప గాయాలు కాగా, చోరీకి గురైన బంగారు మంగళసూత్రం సుమారు 4.5 తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story