Hyderabad: ఇందిరా పార్కు వద్ద సెంట్రింగ్ కార్మికుల భారీ ధర్నా.. లీడర్ల మద్దతు!
Hyderabad: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద సెంట్రింగ్ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు.
Hyderabad: ఇందిరా పార్కు వద్ద సెంట్రింగ్ కార్మికుల భారీ ధర్నా.. లీడర్ల మద్దతు!
Hyderabad: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత వారం రోజులుగా నగరంలో సెంట్రింగ్ కార్మికుల ఆందోళన.. నేడు ఇందిరా పార్కు ధర్నాచౌక్ దగ్గర చేపట్టిన ధర్నాకు కొండాపూర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన కార్మికులు.. నాయకులు అసోషియేషన్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ నగరంలోని భవన నిర్మాణాల్లో సెంట్రింగ్ ప్రధాన పాత్ర అని అలాంటిది తమకు పనికి తగ్గ ఫలితం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సెంట్రింగ్ ఫీట్ కు 50 రూపాయలు ధరలను పెంచడంతో పాటు ప్రభుత్వం కార్మికులకు ఇన్సూరెన్స్ తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు.
Next Story




