Moti Nagar: విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కొరకు నిరసన ర్యాలీ- రావుల శ్రీధర్ రెడ్డి
Moti Nagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.
Moti Nagar: విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కొరకు నిరసన ర్యాలీ- రావుల శ్రీధర్ రెడ్డి
Hyderabad: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామంటూ మోతీ నగర్ లో సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు లో జరుగుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా భారీ ర్యాలీ ని చేపట్టారు.
ర్యాలీ లో బి.ఆర్.ఎస్ నాయకులు మాజీ సాప్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బకాయిలు చెల్లించకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ ను బదిలీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నారన్నారు.
కాంగ్రెస్ చేసే ఈ అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన ర్యాలీలలో భాగంగా భారీగా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులు తమకు జరిగే అన్యాయాన్ని ఎదురించి విద్యార్థి దశ నుండే పోరాట పటిమ అలవర్చుకోవలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు అన్ని విధాలుగా బిఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు.ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.




