Secunderabad: కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల భూమి ఆక్రమణలపై BRS నిరసన!

Secunderabad: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నిరసన కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల సర్కారు భూమిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టాలని డిమాండ్.

Srikanth, Secunderabad
Published on: 3 Sept 2026 7:03 PM IST
Secunderabad
X

Secunderabad: కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల భూమి ఆక్రమణలపై BRS నిరసన!

Secunderabad: సికింద్రాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన ప్రజల ను మోసముతోనే ఇచ్చిన హామీలు గ్యారంటీలు డిక్లరేషన్లు అమలు కాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా బూతులు కాదు కేవలం ప్రజల సమస్యలపైనే బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె కృశాంక్, గజ్జల నాగేష్ నివేదిత సాయన్నలు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై కంటోన్మెంట్ లోని ఏడవ వార్డులో రెండవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ నిషేధిత భూములను కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 157/1 సర్వే నెంబర్ లో 8 ఎకరాల స్థలంలో 6000 ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేదని, 800 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తుంటే కోర్టులో ఇప్పటివరకు ఎందుకు దాకలో నమోదు చేయలేదని వారు ప్రశ్నించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story