Rangareddy: కల్యాణ లక్ష్మి చెక్కులపై కౌంటర్ ఏది? బాలాపూర్‌లో బీఆర్ఎస్ ధర్నా!

Rangareddy: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులపై కోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ బాలాపూర్ మండల కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆందోళన.

RAHUL, MEERPET
Published on: 17 Aug 2026 1:47 PM IST
Rangareddy
X

Rangareddy: కల్యాణ లక్ష్మి చెక్కులపై కౌంటర్ ఏది? బాలాపూర్‌లో బీఆర్ఎస్ ధర్నా!

Rangareddy: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనలతో బడంపేట్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులపై కోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం తరఫున ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి లబ్ధిదారులకు చెక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story