Tandur: రోహిత్ రెడ్డిపై నోరుపారేసుకుంటే ఊరుకోం: తాండూరు బీఆర్ఎస్!
Tandur: పైలట్ రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తాండూరు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
Tandur: రోహిత్ రెడ్డిపై నోరుపారేసుకుంటే ఊరుకోం: తాండూరు బీఆర్ఎస్!
తాండూరు: రోహిత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని తాండూరు బీఆర్ఎస్ నాయకులు ఆసిఫ్,సంతోష్ గౌడ్, ఇర్షాద్, సురేష్ లు అన్నారు.శనివారం తాండూరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటుకు నోటు అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన విషయం కాంగ్రెస్ నేతలు మరిచినట్లున్నారన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ కేసు,డ్రగ్స్ కేసు అంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలన్నారు. డ్రగ్స్ కేసు విచారణకు రాకముందే దానిపై తీర్పు వెలుపడక ముందే ఈ విధంగా ఒక వ్యక్తి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
తాండూరు నీళ్లు నిధులను కొడంగల్ కు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధారాధత్వం చేస్తున్నారన్నారు. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్ కు మార్చేస్తున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తాండూర్ కు వస్తే దానిని కొడంగల్లోని లగ్గచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. కాగ్న నీళ్లను తాండూరు వాసులకు అందించకుండా కొడంగల్ కు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.
నర్సింగ్ కాలేజీ కోసం రోహిత్ రెడ్డి అహర్నిశలు కష్టపడి తాండూరు కు తీసుకొని వస్తే దాంట్లో కొడంగల్ మెడికల్ కాలేజీ నిర్వహిస్తూ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు పాత భావనాన్ని ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూట్ కేసులను ఢిల్లీకి మోసుకెళ్తూ ఉంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రజల డబ్బులను కొడంగల్ కు మోసుకెళ్తున్నారన్నారు. రోహిత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ గాజులు ఎవరూ వేసుకుని కూర్చోలేదన్నారు.




