Hyderabad: సాధారణ ప్రజలకు ఒక న్యాయం.. మంత్రి కొడుకుకు ఒక న్యాయమా?
Hyderabad: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పోక్సో కేసు నమోదైనప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై బిఆర్ఎస్ నేత నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు.
Hyderabad: సాధారణ ప్రజలకు ఒక న్యాయం.. మంత్రి కొడుకుకు ఒక న్యాయమా?
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ పై ఫోక్సో చట్టం కేసు నమోదైన ఇప్పటికీ అతని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏం నగేష్ ముదిరాజ్ ఆరోపించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు నమోదైనప్పటికీ సాధారణ ప్రజలకు, ఒక న్యాయం, మంత్రి కొడుకుకు ఒక న్యాయం అన్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనీ అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసును దారి మళ్లించేందుకు హనీ ట్రాప్ చేసి కింద నమోదు చేసి చేతులు దులుపుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వెంటనే మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బండి సాయి భగీరథను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.తన కొడుకు చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి భే షరతుగా రాజీనామా చేయాలనీ లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వమే బండి సంజయ్ ను తన పదవి నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లు ఆస్కార్ అవార్డు పొందేందుకు అపూర్వ సోదరులుగా నటించడం దారుణం అన్నారు.
బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ కేసును నిర్వీర్యం చేసి బిజెపి కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదాన్ని నిజం చేశారు. మైనర్ బాలికకు న్యాయం జరిగితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ లు ఆ బాలికకు మద్దతుగా ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును తప్పుదారి పట్టించేందుకు ఫోక్సో చట్టం కింద నమోదైన కేసును హనీ ట్రాప్ కింద చూపించి తన కొడుకును కాపాడుకోవడానికి బండి సంజయ్ చేస్తున్న కుట్రలు సిగ్గుచేటు అన్నారు.




