Medchal: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై క్రిషాంక్ తీవ్ర విమర్శలు!

Medchal: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై బీఆర్‌ఎస్ కన్వీనర్ క్రిషాంక్ ఘాటు విమర్శలు చేశారు. అల్వాల్ టీమ్స్ ఆస్పత్రి నిర్మాణంపై ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

PURENDAR, ALWAL
Published on: 29 July 2026 5:39 PM IST
Medchal
X

Medchal: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై క్రిషాంక్ తీవ్ర విమర్శలు!

మేడ్చల్ జిల్లా:

కంటోన్మెంట్ ఎమ్మెల్యే పోటోలు, రీల్స్, కమిషన్లు కోసం తప్పా నియోజక వర్గం ప్రజల కోసం చేసింది ఏమీలేదని బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ విమర్శించారు. అల్వాల్ టీమ్స్ ఆస్పత్రి నిర్మాణంలో బి.ఆర్.ఎస్ పార్టీ పాత్ర కేవలం 11 శాతమే అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన కామెంట్ పై క్రిషాంక్ ఘాటుగా స్పందించారు. నియోజక వర్గం పేదప్రజలను కూడా వదలకుండా కమిషన్ల కోసం పనులను జరుగకుండా అడ్డుకునే ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బి.ఆర్.ఎస్ ను విమర్శించే స్థాయి లేన్నారు. నగరం నలుమూలల పేద ప్రజల కోసం నిర్మిస్తున్న నాలుగు 1000 పడకల ఆసుపత్రుల్లో ఒకటైన అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి గతంలోనే 90 శాతం పూర్తి చేసిందని అధికార కాంగ్రెస్ పార్టీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం శ్రీ గణేష్ మరిచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కమిషన్ల కోసం పనిచేస్తే, బి.ఆర్.ఎస్ పేద ప్రజల కోసం పనిచేసిందంటూ క్రిషాంక్ చెప్పుకొచ్చారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story