Khairatabad: జలమండలి జీఎంతో ఎంజీఆర్ భేటీ.. సమస్యలపై వినతి!
Khairatabad: తాగునీరు, సీవరేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి జలమండలి జీఎం ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
Khairatabad: జలమండలి జీఎంతో ఎంజీఆర్ భేటీ.. సమస్యలపై వినతి!
ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు ఈరోజు HMWSB (SR నగర్) GM ప్రభాకర్ రావు గారిని కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానంగా ఖైరతాబాద్ ఆంధ్రగల్లీలో నూతన సీవరేజ్ పైప్‌లైన్ ఏర్పాటు, న్యూ CIB క్వార్టర్స్‌లో నూతన సీవరేజ్ పైప్‌లైన్, అలాగే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలు, నీటి సరఫరాలో సమయపాలన లోపం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను MGR గారు GM ప్రభాకర్ రావు గారి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు నిరంతరాయంగా, నిర్ణీత సమయానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, సీవరేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరితగతిన చేపడతామని GM ప్రభాకర్ రావు గారు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజ్జెల ఆనంద్,శ్రీనివాస్, శామ్ గౌడ్,బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




