Tandur: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కౌన్సిలర్ ఇర్షాద్ వినతి!

Tandur: తాండూరులో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 5 Aug 2026 7:17 AM IST
Tandur
X

Tandur: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కౌన్సిలర్ ఇర్షాద్ వినతి!

Tandur: తాండూరు మున్సిపల్ పరిధిలో అక్రమంగా ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని 7 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ మున్సిపల్ కమిషనర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రం అందజేసిన అనంతరం కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ...

తాండూరు పట్టణంలోని సర్వే నెంబర్ 135 లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సర్వేనెంబర్ 111 లో వివాదాస్పద నిర్మాణాలు, ఆక్రమణలతో సంబంధం ఉన్న వ్యక్తులే నేడు సర్వేనెంబర్ 135 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ అధికారులుగా నిజానిజాలను పరిశీలించి సర్వేనెంబర్135 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తగు తీసుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ను కోరడం జరిగిందని అన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story