Medchal: కాంగ్రెస్ హామీల అమలుపై గౌడవెళ్లిలో బీఆర్‌ఎస్ ఆటో ర్యాలీ!

Medchal: కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందంటూ గౌడవెళ్లిలో బీఆర్‌ఎస్ భారీ ఆటో ర్యాలీ. ఆటో డ్రైవర్లకు రూ.12 వేల జీవన భృతి వెంటనే ఇవ్వాలని జగన్ రెడ్డి డిమాండ్.

NAKSHATRAM, MEDCHAL
Published on: 6 Sept 2026 12:14 PM IST
Medchal
X

Medchal: కాంగ్రెస్ హామీల అమలుపై గౌడవెళ్లిలో బీఆర్‌ఎస్ ఆటో ర్యాలీ!

Medchal: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని గౌడవెళ్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ మోసపూరిత 420 హామీలకు నిరసనగా గుండ్లపోచంపల్లి డివిజన్‌ పరిధిలోని గౌడవెళ్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల జీవన భృతి అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story