Secunderabad: విద్యుత్ సిబ్బంది భారీ ధర్నా.. ఏఈ ఒత్తిడి వల్లే ప్రమాదం!
Secunderabad:
Secunderabad: విద్యుత్ సిబ్బంది భారీ ధర్నా.. ఏఈ ఒత్తిడి వల్లే ప్రమాదం!
సికింద్రాబాద్: పై అధికారుల వేధింపులు తట్టుకోలేక జూనియర్ లైన్ మెన్ల తోపాటు కింది స్థాయి సిబ్బంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని బోయిన్ పల్లి డివిజన్ ఎలక్ట్రీసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న మోహన్ అనే జూనియర్ లైన్ మెన్ ఏ ఈ అకీల్ వత్తిడితో ఓల్డ్ బోయిన్ పల్లి సమతా నగర్ లో విద్యుత్ సప్లయ్ ప్రాబ్లం ఉంది రెట్టి పై చేయాలని బలవంతంగా ఒక్కడినే పంపడంతో పై అధికారి ఒత్తిడి మాటలకు తను ఏమీ చేస్తున్నాడో తెలియక
పవర్ ఆప్ చేయకుండా కరంటు పోల్ ఎక్కి ఉన్న ప్రాబ్లం చూస్తుండగా ఒక్కసారిగా కరంటు షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలు అయ్యాడని సహా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
జరిగిన సంఘటనకు నిరసనగా ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ సబ్ స్టేషన్ ముందు ఎలక్ట్రిసిటీ సిబ్బంది ధర్నా నిర్వహించారు.ఇద్దరు ముగ్గురు చేసే పని ఒక్కడి పై మోపి పై అధికారులు తీవ్ర ఒత్తి చేయడం వల్లనే ఇలాంటి ఘటనలు జరిగి సీనియర్.
జూనియర్ తేడా లేకుండా లైన్ మెన్లు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు..ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మ్యాన్ కొరత కారణం చూపు అధికారులు కింది స్థాయి సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడటం జరుతుందన్నారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా సీఎండీ తోపాటు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎలక్ట్రిసిటీ సిబ్బందిని కాపాడాలని డిమాండ్ చేశారు..




