Kukatpally: వైభవంగా బోనాలు పట్టువస్త్రాలు సమర్పించిన బండి రమేష్!

Kukatpally: కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రీ నగర్ డివిజన్‌లో వేముల స్రవంతి సత్యం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJESH,	WEST ZONE
Published on: 8 Aug 2026 2:37 PM IST
Kukatpally
X

Kukatpally: వైభవంగా బోనాలు పట్టువస్త్రాలు సమర్పించిన బండి రమేష్!

Kukatpally: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని గాయత్రీ నగర్ డివిజన్‌లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేముల స్రవంతి సత్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కమ్మ సంఘం చైర్మన్ బండి రమేష్ పలు ఆలయాలను సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల వేడుకలతో గాయత్రీ నగర్ డివిజన్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story