Boduppal: బోడుప్పల్‌లో ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్‌ల పరిశీలన
Boduppal: బోడుప్పల్‌లో ఓటరు జాబితా సవరణ (SIR) హెల్ప్ డెస్క్ కేంద్రాలను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి. అర్హులంతా ఓటరు సవరణలో పాల్గొనాలని పిలుపు.
Boduppal: బోడుప్పల్‌లో ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్‌ల పరిశీలన
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధి బోడుప్పల్ లోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) హెల్ప్ డెస్క్ కేంద్రాలను మాజీ జెడ్పీటీసీ, బోడుప్పల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పరిశీలించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణతో కలిసి హెల్ప్ డెస్క్‌ల పనితీరు, ఓటర్లకు అందుతున్న సేవలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని, తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హెల్ప్ డెస్క్‌ల ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులు, బీఎల్‌వోలకు సూచించారు.
ఈ పరిశీలనలో బోయిని బిక్షపతి, ఏనుగు లక్ష్మయ్య, బందారం నప్రతి అర్హత గేష్ గౌడ్, బందారం శ్రీధర్ గౌడ్, ఎల్లగొని శ్రీహరి గౌడ్, మన్నె ప్రభాకర్ రెడ్డి, మైసగళ్ల శ్రీకాంత్, ఎర్రగుడ్ల సత్యమూర్తి యాదవ్, సామల బాల్‌రెడ్డి, సంబంధిత అధికారులు, బీఎల్‌వోలు, బీఆర్‌ఎస్ నాయకులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.




