Boduppal: బచ్పన్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Boduppal: బోడుప్పల్ బచ్పన్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, యాజమాన్యం.

KARUNAKAR, UPPAL
Published on: 15 Aug 2026 5:03 PM IST
Boduppal
X

Boduppal: బచ్పన్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Boduppal: బోడుప్పల్‌ మల్లికార్జుననగర్‌లోని బచ్పన్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది. కార్యక్రమానికి బచ్పన్ అకాడమిక్ పాఠశాలల చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జ్ పద్మనాభం రెడ్డి, రీజినల్ అకాడమిక్ కో-ఆర్డినేటర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీతా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముఖ్య అతిథులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు త్రిభాషల్లో ప్రసంగిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు.

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి భావాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలు, దేశభక్తి కార్యక్రమాలతో పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story