Nacharam: నాచారంలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే: భారీ రక్తదాన శిబిరం!
Nacharam: నాచారం డివిజన్ సీడీఎస్ భవనంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉప్పల్ ఇంచార్జ్ నిహారిక ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు.
Nacharam: నాచారంలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే: భారీ రక్తదాన శిబిరం!
నాచారం: నాచారం డివిజన్‌లోని సీడీఎస్ భవనంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఇంచార్జ్ నిహారిక హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అవసరమైన వారికి ప్రాణదానం చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ జనసేన నాయకులు రామకృష్ణారెడ్డి, జమ్మల మధు, సోమేశ్, కే. మధు, సాయికిరణ్, వి. మధు, సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story




