Dilsukhnagar: విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం!
Dilsukhnagar: విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం భారీ ఆందోళన చేపట్టింది.
Dilsukhnagar: విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం!
దిల్‌సుఖ్‌నగర్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేవైఎం నేతలు, ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరసన నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story




