Vikarabad: బీజేపీ ప్రెస్ మీట్ పరమేశ్వర్ రెడ్డిపై దాడి ఖండన!

Vikarabad: వికారాబాద్‌లో బీజేపీ ప్రెస్ మీట్. మోదీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పరమేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ దాడులను ఖండించిన నేతలు.

MOGULAIAH, VIKARABAD
Published on: 25 July 2026 6:44 AM IST
Vikarabad
X

Vikarabad: బీజేపీ ప్రెస్ మీట్ పరమేశ్వర్ రెడ్డిపై దాడి ఖండన!

Vikarabad: ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారనే సమాచారం అందడంతో ఆందోళనను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడు మిట్ట పరమేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయ విభేదాలను హింసాత్మక దాడుల ద్వారా వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు.

తెలంగాణలో జరిగిన పేపర్ లీకేజీ ఘటనలను సాకుగా చూపుతూ బీజేపీపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల రాజకీయ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు గానీ, గుండాయిజం, భౌతిక దాడులు ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

ఒకరిద్దరు నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే బీజేపీ శ్రేణులు సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

మిట్ట పరమేశ్వర్ రెడ్డిపై దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story