Hyderabad: పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి: బీజేపీ నేత కీర్తిరెడ్డి!
Hyderabad: హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద 22ఏ లో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహాదీక్ష నిర్వహించింది.
Hyderabad: పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి: బీజేపీ నేత కీర్తిరెడ్డి!
హైదరాబాద్: - రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి - బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి, హైదరాబాద్ ధర్నా చౌక్ లో శనివారం బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 22ఏలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని బీజేపీ మహాదీక్ష. ఈ ధర్నాలో పాల్గొని బీఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపిన కీర్తిరెడ్డి.
ఈ మహా దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఎంపీలు డీకే.అరుణ, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు.
కామెంట్స్
- రాష్ట్రంలో అరాచక పాలన , అసమర్థ పాలన నడుస్తోంది
- ఏం సాధించారని 1000 రోజులు సంబరాలు
- అడ్డగోలుగా హైడ్రా పేరుతో పేద ఇండ్లు కూల్చినందుకా..? 22ఏ పేరుతో నిరుపేదల భూములు నిషేధిత జాబితాలో చేర్చినందుకా.. ?
- మాది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి కొంచమైనా సిగ్గనిపిస్తలేదా..?
- అవును తప్పు జరిగింది క్షమించండి అని మీ రెవెన్యూ మినిష్టరే అంటున్నారు కదా
- మీవీ నిషేధిత జాబితాలో చేర్చితే క్షణాల్లో రిలీవ్ చేస్తారు
- మీతో అంటకాగే.. ఎంఐఎం కాలేజీలో బఫర్ జోన్ లో ఉన్నా కూల్చరు..?
- నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు అడిగే వారు లేరనా మీ ఈ అరాచకం
మీకు రోజులు దగ్గర పడ్డాయి
- రాష్ట్రంలో అరాచక కాంగ్రెస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
- నమ్మి అధికారం ఇస్తే.. ఓట్లేసిన ప్రజల్నే దోచేస్తారా..?
- ఖబర్దార్ రేవంత్ రెడ్డి... పేదల పక్షాన బీజేపీ తరపున మేం ఉన్నాం
- నీ అవినీతి లెక్కలన్నీ తీస్తాం.. నీ భరతం పడతాం
న్యాయం జరిగే వరకు పోరాటం
- ఈ రోజు దీక్షతో ఈ పోరాటం ఆగదు..
- 22ఏలొ ఇష్టానురీతిగా చేర్చిన నిరుపేదల భూములన్నీ రిలీవ్ చేయాలి
- అప్పటి వరకు అడుగడుగునా ఈ దగాకోరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటాం.. ప్రశ్నిస్తూనే ఉంటాం...
- 22ఏ బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడతాం - జూటూరు కీర్తిరెడ్డి




