Hyderabad: రేవంత్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు దుర్మార్గం!
Hyderabad: మహిళా నేతల పట్ల రేవంత్ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి తీవ్ర ఆగ్రహం.
Hyderabad: రేవంత్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు దుర్మార్గం!
Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి సూటి ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, పోలీసులు వ్యవహరించిన తీరుపై బుధవారం జూబ్లీహిల్స్ లో తీవ్ర ఆగ్రహం. రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని వార్నింగ్.
తోడు దొంగలు.. తొండి రాజకీయాలు
ప్రజాసమస్యలపై నిర్ణయాత్మక చర్చలకు వేదిక అసెంబ్లీ. అలాంటి వేదికను కూడా కాంగ్రెస్ బీఆరెస్ లు అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించాల్సింది పోయి స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయి, అధికారం పోయిందన్న బాధ ఒకరిది ఉన్నది కాస్త పోతుందేమో అన్న భయం మరొకరిది.
ఇదేనా ప్రజా ప్రతినిధులుగా మీరు ప్రవర్తించే విధానం. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫ్యమేనని కౌంటర్కాం, గ్రెస్ ఏనాడూ మహిళలను గౌరవించిందని, అసెంబ్లీ ముట్టడి వ్యవహారంలో మాజీ మంత్రులు, బీజేపీ మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం.
ప్రజాస్వామ్యంంలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదా..ఝ, తెలంగాణ రాజకీయాల్లో మహిళానేతలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? హోం మంత్రిగా రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను పరిరక్షణలో ఫెయిల్ అయ్యాడు. ఆయనకు పరిపాలన విధానం, అడ్మినిస్ట్రేషన్ ఇంకా అర్థం కావడం లేదు.
ఆడబిడ్డల చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు పట్టి లాగడమేనా ఇందిరమ్మ పాలన అంటే..? మహిళలను ఏడిపించిన పాపం మూటగట్టుకున్నావ్ రేవంత్ రెడ్డి, ఇక నీకు మూడినట్టే.
అక్కడలా.. ఇక్కడిలా..
రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకొని మహిళలు ముందుకు రావాలని వీళ్ల రాహుల్ గాంధీ ఢిల్లీలో గప్పాలు కొడుతుంటే.. ఇక్కడున్న హిట్లర్ రేవంత్ ప్రభుత్వం మహిళా శాసన సభ్యులపై దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది.
విమెన్ పేట్రీయాటిజం అంటూ గప్పాలు గొట్టడం కాదు రాహుల్ గాంధీ గారూ మహిళలను ఎలా గౌరవించాలో మీ ముఖ్యమంత్రికి నేర్పండి. మాజీ మంత్రులపై , మహిళానేతలపై సభ్య సమాజం సిగ్గు పడేలా దాడులు చేయడమా ప్రజాపాలన అంటే?. డైవర్షన్ వద్దు ఇష్యూస్ పై డిస్కస్ చేయండి.
ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పే దమ్ములేక బీఆరెస్ తో కలిసి కాంగ్రెస్ డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఇప్పటికైనా బీఆరెస్, కాంగ్రెస్ లు స్వార్థ రాజకీయాలు మానుకోవాలి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ వేదికగా చర్చించడానికి చాలా సమస్యలున్నాయి
ఫీజు రీయంబర్స్ మెంట్ , 97 జీవో, 22ఏ సమస్యలు ఇలా చాలానే ఉన్నాయి. ముందు ప్రతిపక్ష పార్టీల ప్రశ్నలకు బాధ్యత గల పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా బేషరతుగా సమాధానం చెప్పాలి.




