Ramchander Rao: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు!

BJP Foundation Day 2026: భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

Arun Chilukuri
Published on: 6 April 2026 12:54 PM IST
Ramchander Rao
X

 Ramchander Rao: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు!

BJP Foundation Day 2026: భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రామచందర్‌రావు సూచించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశాన్ని వికసిత భారత్‌గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story