Boduppal: బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లో ఘనంగా బీరప్ప బోనాలు
Boduppal: బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లో ఘనంగా బీరప్ప బోనాల వేడుకలు. మహిళల నైవేద్య సమర్పణ, పోతురాజుల విన్యాసాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహణ.
Boduppal: బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లో ఘనంగా బీరప్ప బోనాలు
Boduppal: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్‌నగర్ కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో శనివారం బీరప్ప బోనాల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బీరప్పస్వామికి నైవేద్యం సమర్పించారు.
కాలనీలో పండుగ వాతావరణం నెలకొనగా.. బీరప్పస్వామి నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. దారి పొడవునా డొల్ల కళాకారుల విన్యాసాలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యువత, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ జలేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.




