Hayathnagar: ఫీజు బకాయిలు చెల్లించాలి: హయత్ నగర్‌లో బీసీ సంఘం ధర్నా!

Hayathnagar: రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

AJAY, HAYATH NAGAR
Published on: 31 July 2026 1:55 PM IST
Hayathnagar
X

Hayathnagar: ఫీజు బకాయిలు చెల్లించాలి: హయత్ నగర్‌లో బీసీ సంఘం ధర్నా!

Hayathnagar: 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు హయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం ముందు బీసీ సంఘ నాయకులు ఎత్తిరీ భీమ్రాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు.

14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను చెల్లించాలన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఫీజుల బకాయిలు అందక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, విద్యావేత్తలు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.

బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే

పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసన ధర్నాలు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story