Abdullahpurmet: బాటసింగారంలో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Abdullahpurmet: రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్‌ను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లడంతో రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి.

AJAY, HAYATH NAGAR
Updated on: 10 Sept 2026 4:32 PM IST
Abdullahpurmet
X

Abdullahpurmet: బాటసింగారంలో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ అద్దె బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన బస్సు వేగంగా వస్తుండగా, ఓ బైక్‌ను తప్పించబోయే క్రమంలో అదుపు తప్పినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. అయితే బస్సు ఢీకొట్టిన ప్రాంతంలో డీజిల్‌ పంపు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని పెట్రోల్ బంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story