Kukatpally: కూకట్‌పల్లిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!

Kukatpally: కూకట్‌పల్లిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. కెమికల్ విగ్రహాలకు దూరంగా ఉండాలని పిలుపు.

Maruthisagar, Kukatpally
Published on: 13 Sept 2026 6:30 AM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!

Kukatpally: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు అజయ్ రాయుడు సుమారు 500 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు.

రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి కాలుష్యం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.

యువత ముందుకు వచ్చి పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally