Sanathnagar: కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.. కండువా కప్పిన కోట నీలిమ!
Sanathnagar: బన్సీలాల్‌పేట్‌లో డాక్టర్ కోట నీలిమ, కె. దీపక్ జాను సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు నాయకులు.
Sanathnagar: కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.. కండువా కప్పిన కోట నీలిమ!
Sanathnagar: సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. జబ్బర్ కాంప్లెక్స్ వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ డివిజన్‌కు చెందిన పలువురు నూతన సభ్యులు జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎంపీ సునీల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై.ఎం. విజయ్ కుమార్ గారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సనత్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏఐసీసీ సభ్యురాలు డా. కోట నీలిమ గారు, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె. దీపక్ జాను గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంపై పూర్తి విశ్వాసంతోనే పార్టీలో చేరుతున్నట్లు నూతన సభ్యులు తెలిపారు.
పార్టీలో చేరిన వారు
సిహెచ్. శివకుమార్, సిహెచ్. లింగమూర్తి, జి. ఎల్లేష్, ఎం. శ్రీధర్, పి. ప్రవీణ్ చారి, సిహెచ్. వెంకట్ రెడ్డి, ఎం. నవీన్, ఎల్. వీరస్వామి, ఏ. రాజు, ఏ. అంజయ్య, కె. సూర్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
బన్సీలాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు జి.ఎల్. రమేష్ బాబు, పద్మారావునగర్ డివిజన్ అధ్యక్షుడు మెరుగు జగదీశ్వర్, బన్సీలాల్‌పేట్ డివిజన్ ఎస్సీ సెల్ చైర్మన్ ఏ. మహేష్, పీసీసీ మాజీ కార్యదర్శి మల్లం రమేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సికింద్రాబాద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ కృపా ప్రసాద్, ఎస్సీ సెల్ సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కొండల్, డీసీ ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, డీసీ ప్రధాన కార్యదర్శి వి.ఎస్. నారాయణ, సికింద్రాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె. రాజశేఖర్ రావు
అనసూయ, భాగ్యమ్మ, ఎం. యాదవ్ చారి, మామిడాల బాలకృష్ణ, సుమన్, దినేష్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. సునీల్, కొండ్రు రమేష్, వినయ్, పాండు, హేమంత్ జి., శ్యామ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




