Banjara Hills: బంజారాహిల్స్‌లో జాతీయ చేనేత ప్రదర్శన!

Banjara Hills: బంజారాహిల్స్ కళింగ కల్చరల్ సెంటర్‌లో జాతీయ చేనేత, పట్టు వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. 14 రాష్ట్రాల నుంచి 74 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

RAJESH,	WEST ZONE
Published on: 8 Sept 2026 3:16 PM IST
Banjara Hills
X

Banjara Hills: బంజారాహిల్స్‌లో జాతీయ చేనేత ప్రదర్శన!

Banjara Hills: బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటైన జాతీయ చేనేత, పట్టు వస్త్రప్రదర్శనను నగర సామాజికవేత్త సుషిల బొకాడియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడి హాల్లో ఉన్న చేనేతకారులు వస్త్ర ఉత్పత్తులను తిలకిస్తూ, చేనేతకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసు కున్నారు.

నిర్వాహకులు జయేషుప్తా మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన దేశంలోని 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 74 వేల రకాల వస్త్రోత్పుత్తులను అందుబాటులో ఉంచారన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story