Kukatpally: రాఖీ పండుగ వేళ బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లు అందజేత!
Kukatpally: CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన 30 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన బాలానగర్ పోలీసులు. రాఖీ పండుగ వేళ హర్షం వ్యక్తం చేసిన బాధితులు.
Kukatpally: రాఖీ పండుగ వేళ బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లు అందజేత!
Kukatpally: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి యజమానులకు అప్పగించారు. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొత్తం 30 మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించారు.. నేడు 5 మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేశారు.
మిగిలిన మొబైల్ ఫోన్లను శనివారం బాలానగర్ ఏసీపీ చేతుల మీదుగా అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు. బాలానగర్ సీఐ ప్రశాంత్, డీఐ సక్రం, పోలీసు సిబ్బంది సమక్షంలో మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. రాఖీ పండుగ సందర్భంగా తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




