Balkampet: అల్లోపతి వైద్యులతో సమానంగా స్టైఫండ్ పెంచాలి ఆయుష్ జేఏసీ!
Balkampet: అల్లోపతి వైద్యులతో సమానంగా తమకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ బల్కంపేట ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం వద్ద తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు నిరవధిక సమ్మె చేపట్టారు.
Balkampet: అల్లోపతి వైద్యులతో సమానంగా స్టైఫండ్ పెంచాలి ఆయుష్ జేఏసీ!
బల్కంపేట: అల్లోపతి వైద్యసర్జన్లతో సమానంగా తమకు ప్రభుత్వం ఉపకార వేతనాన్ని పెంచాలని ఆయూష్ హౌస్ సర్జన్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయూష్ హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్ల జేఏసీ పిలుపు మేరకు బల్కంపేటలోని కొణి జేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో పని చేస్తున్న హౌస్ సర్జన్లు గత తొమ్మిది రోజులు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు.
ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. వీరికి ప్రస్తుతం ప్రకృతి వైద్య అభ్యసి స్తున్న విద్యార్థులు మద్దతు పలికారు.
తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి తమకు ఉపకార వేత నాన్ని పెంచలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయూష్ జూనియర్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపకార వేతనాన్ని పెంచే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




