Hyderabad: ఉప్పల్: నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

Hyderabad: స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో తెలంగాణలో ఆయుష్ వైద్యులు, పీజీ విద్యార్థులు నేటి నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగారు.

KARUNAKAR, UPPAL
Published on: 4 Aug 2026 8:05 AM IST
Hyderabad
X

Hyderabad: ఉప్పల్: నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

స్టైపెండ్ పెంపే డిమాండ్.. నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె

హైదరాబాద్ ఉప్పల్: స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో తెలంగాణలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టనున్నారు. గత పదేళ్లుగా హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్ల స్టైపెండ్లలో ఎలాంటి పెంపు లేదని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఇదే సమయంలో జీవన వ్యయం, వసతి, ఆహారం, ప్రయాణం, విద్యా ఖర్చులు గణనీయంగా పెరిగినా స్టైపెండ్ మాత్రం యథాతథంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించి, అధికారులను కలిసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆయుష్ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైపెండ్ దేశంలోనే అత్యల్పంగా ఉందని, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో దీనికంటే రెండింతలకు పైగా స్టైపెండ్ అందుతున్నప్పటికీ తెలంగాణలో పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని జేఏసీ ఆరోపించింది. సమ్మెకు ముందు ప్రభుత్వానికి 15 రోజుల నోటీసు ఇచ్చినా స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story