Pargi: రూ.1.20 లక్షల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన నందు!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం నక్కల్‌లో రూ.1.20 లక్షల డబ్బుల వివాదంలో సెంట్రింగ్ కార్మికుడిపై కత్తితో దాడి.

WAZID, PARIGI
Updated on: 9 Sept 2026 1:23 PM IST
Pargi
X

Pargi: రూ.1.20 లక్షల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన నందు!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం నక్కల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం కత్తితో దాడికి దారితీసింది.నక్కల్ గ్రామానికి చెందిన గౌసుద్దీన్, నందు ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. వీరి మధ్య డబ్బుల విషయంలో కొంతకాలంగా వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.

తనకు రూ.1 లక్షా 20 వేల రూపాయలు రావాల్సి ఉందని, ఎన్నిసార్లు అడిగినా నందు డబ్బులు ఇవ్వలేదని గౌసుద్దీన్ ఆరోపించాడు. ఈ క్రమంలో డబ్బుల విషయం మాట్లాడుకుందామని గౌసుద్దీన్‌ను తీసుకెళ్లి నందు కత్తితో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.

దాడి నుంచి తప్పించుకున్న గౌసుద్దీన్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. గాయాలతో ఉన్న అతడిని పోలీసులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలు, డబ్బుల వివాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story