Attapur: అత్తాపూర్ బాధితులకు 25 రికవరీ మొబైల్స్ అందజేసిన పోలీసులు

Attapur: CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ₹2 లక్షల విలువైన 25 ఫోన్లను బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు. ఫోన్ పోతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన.

Arun Goud, Hyderabad
Published on: 19 Aug 2026 8:10 PM IST
Attapur
X

Attapur: అత్తాపూర్ బాధితులకు 25 రికవరీ మొబైల్స్ అందజేసిన పోలీసులు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ 'సి.ఇ.ఐ.ఆర్' (CEIR - Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో రికవరీ చేసిన సుమారు ₹2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విలువ కలిగిన 25 మొబైల్ ఫోన్లను అత్తాపూర్ పోలీసులు బుధవారం నాడు బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (Inspector of Police) శ్రీ ఎ. సీతయ్య గారు ఫోన్ బాధితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తగిన ఆధారాలు సరిచూసుకున్న అనంతరం వారి మొబైల్ ఫోన్లను నేరుగా అందజేశారు. పోయాయనుకున్న తమ విలువైన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ, అత్తాపూర్ పోలీసులకు మరియు క్రైమ్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. సీతయ్య గారు మాట్లాడుతూ: "ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా కంగారు పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా ఆన్‌లైన్ ద్వారా 'CEIR' (ceir.sancharsaathi.gov.in) పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. CEIR పోర్టల్‌లో ఐఎంఈఐ (IMEI) నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, దానిని త్వరగా ట్రాక్ చేసి రికవరీ చేయడానికి సులభమవుతుంది" అని సూచించారు.

ఈ కార్యక్రమంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (DI) శ్రీ రాజు నాయక్ గారితో పాటు క్రైమ్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: ఎ. సీతయ్య, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO / ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్),అత్తాపూర్ పోలీస్ స్టేషన్, రాజేంద్రనగర్ జోన్,హైదరాబాద్ సిటీ.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad

Next Story