Hyderabad: ఏడేళ్ల వయసులో చెస్ ప్రపంచ రికార్డు హైదరాబాద్ రత్నం అథిర!

Hyderabad: ఏడేళ్ల అథిర ప్రేమాని ఇందర్ చెస్‌లో అసాధారణ ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. జూబ్లీహిల్స్‌లో గ్రాండ్ వేడుక.

RAJESH,	WEST ZONE
Published on: 23 Aug 2026 8:11 AM IST
Hyderabad
X

Hyderabad: ఏడేళ్ల వయసులో చెస్ ప్రపంచ రికార్డు హైదరాబాద్ రత్నం అథిర!

Hyderabad: ఏడేళ్ల చిన్నారి అథిర ప్రేమాని ఇందర్ చెస్లో అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానంసంపాదించింది. జూబ్లీహిల్స్ లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ లో లెర్నోరమా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ రికార్డు నమోదైంది. ఏకాగ్ర చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అథిర ఏకకాలంలో 15 చెస్ 960 గేమ్స్ లో పాల్గొనడంతో పాటు 210 చెస్ ఫజిల్స్ ను విజయవంతంగా పూర్తి చేసి తన ప్రతిభను చాటింది.

ఈ ప్రదర్శనను పరిశీలించిన చీఫ్ అడ్డుడికేటర్ చొక్కలింగం బాలాజీ, చీఫ్ ఆర్బిటర్ సుబ్బరాజు అథిర ప్రతిభను గుర్తించి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ గ్రాండ్మా స్టర్ బొడ్డ ప్రత్యూష హాజరై అథిర చెస్ ఆటను పరిశీలించి అభినందించారు. రికార్డు సాధించిన సందర్భంగా అథిర కోచ్లు చైతన్య, సందీప్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో గ్రాండ్వ రాస్టర్ కావడమే తన లక్ష్యమని అథిర తెలిపింది. తన తల్లిదండ్రులు ప్రేమ, మణిఇందర్తో పాటు కోచ్ చైత న్య అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందన్నార.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story