Ameerpet: అమీర్‌పేటలో జాబ్ మేళా.. ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని!
Ameerpet: అమీర్‌పేటలో గురు తేగ్ బహదూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Ameerpet: అమీర్‌పేటలో జాబ్ మేళా.. ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని!
అమీర్‌పేట: నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం అమీర్ పేట లోని ధరంకరం రోడ్డులో గల గవర్నమెంట్ హై స్కూల్ లో గురు తేగ్ బహదూర్ జి నిష్కామ్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
ముందుగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు వెళ్ళి పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళా కు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో జాబ్ మేళా ను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనే ఆలోచన తో అనేకమంది నిరుద్యోగులు ఉన్నత చదువులు ఉన్నప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాంటి వారికి జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో వివిధ రంగాలలో అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సొసైటీ ఆధ్వర్యంలో కరోనా సమయంలో అనేకమంది ని ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే జాబ్ మేళా లు మరిన్ని నిర్వహించాలని కోరారు. సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్ లో చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, మల్లిఖార్జున్ గౌడ్, సుమిత్ సింగ్, పప్పు సింగ్, రాజు, సొసైటీ అధ్యక్షులు డింపుల్, కార్యదర్శి గుర్విందర్ సింగ్, కునాల్ సింగ్, హర్మిత్ సింగ్, చరణ్ దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే
ధరం కరం రోడ్డులోని గవర్నమెంట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తప్పని సరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.




