Abdullapurmet: తారామతిపేట్‌లో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన!
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ తారామతిపేట్‌లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి, ప్రజాప్రతినిధులు.
Abdullapurmet: తారామతిపేట్‌లో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన!
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో సైబర్ మెడోస్ వెంచర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను వారు అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక సమానత్వం, విద్య, కళలు, సాంస్కృతిక విలువల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంబేద్కర్ ఆలోచనలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా సాంస్కృతిక కేంద్రం పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.




