Amanaghal: ఆత్మా పథకం ఆధ్వర్యంలో పంటలలో సస్యరక్షణపై క్షేత్ర ప్రదర్శనలు
Amanaghal: ఆమనగల్ మండలంలో ఆత్మా పథకం ద్వారా జొన్న, వరి పంటల్లో సస్యరక్షణ, పోషక యాజమాన్యంపై క్షేత్ర ప్రదర్శనలు. రైతులకు విత్తన శుద్ధి మందుల పంపిణీ.
Amanaghal: ఆత్మా పథకం ఆధ్వర్యంలో పంటలలో సస్యరక్షణపై క్షేత్ర ప్రదర్శనలు
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మండలం ఆత్మా పథకంలో భాగంగా రామ్‌నుంతల, పోలేపల్లి, శెట్టిపల్లి గ్రామాల్లో జొన్న, వరి పంటల్లో సస్యరక్షణ, పోషక యాజమాన్యంపై క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించారు.
రైతులకు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, సూక్ష్మ పోషకాలు అందజేశారు. ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
కార్యక్రమంలో ఏఈఓలు మీనాక్షి, ప్రభావతి, రైతులు పాల్గొన్నారు.
Next Story




