Amangal: శెట్టిపల్లి-ఆకుతోటపల్లి రహదారిపై చెట్ల కొమ్మల తొలగింపు
Amangal: ఆమనగల్ మండలం శెట్టిపల్లి నుంచి ఆకుతోటపల్లి రహదారిపై అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించిన సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ-వెంకటయ్య.
Amangal: శెట్టిపల్లి-ఆకుతోటపల్లి రహదారిపై చెట్ల కొమ్మల తొలగింపు
అమనగల్: శెట్టిపల్లి నుండి ఆకుతోటపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్ల కొమ్మలు రోడ్డుపైకి విస్తరించడంతో వాహనదారులు, రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో స్థానికులు సమస్యను గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్ల కొమ్మల తొలగింపు పనులను ప్రారంభించారు. పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, రహదారిపై ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు, ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వర్షాకాల నేపథ్యంలో రైతులు, వాహనదారులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యల పరిష్కారానికి పంచాయతీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.




